Thursday, May 6, 2010

ఏ నిమిషం ఎటు వెళుతుందో!!

ఆ రోజు ..
చీకటిలో ..
తను వెళ్ళే దారిలో ఒక మనిషి పడిపోయుంటాడని ..
ఆ మనిషి చెయ్యి పట్టుకుంటే చల్లగా ఉంటుందని ..
ఆ మనిషి గుండె ,చప్పుడు చేయటం మానేసిందని ..
నమ్మేసరికి కిట్టు కి కొంతసేపు పట్టింది ..
టెన్షన్ లో ఏం చె
య్యాలో తోచడం లేదు కిట్టు కి ..
అప్పుడు టైం రాత్రి 12:30..
అది చలికాలం....
బీచ్ రోడ్ ..
పక్కనే కొంచెం దూరం లో సముద్రం ..
పైన పున్నమి చంద్రుడు ..
ఎవరికైనా పైనుండి చూస్తే కెరటాలు ఎగిరెగిరి శ్రద్ధ గా
అక్కడేం జరిగిందో !! అని చూస్తునాయి ఏమో అన్నట్టుగా అనిపిస్తుంది ..
వెంటనే కిట్టు సెకండ్ షో చూసి ఇంటికి వెళ్తున్న తన ఫ్రెండ్ కి కాల్ చేసి రమ్మని చెప్పాడు..
అతని ఫ్రెండ్ కి సినిమాలు అంటే చాలా ఇష్టం,సస్పెన్స్ సినిమాలు అంటే మరీ ఇష్టం..
సరే తన ఫ్రెండ్ కి రమ్మని చెప్పిన కిట్టు,అతను వచ్చే లోపు తన మొబైల్ తీసి ఆ వెలుగు లో ఆ ప్రాణం లేని శరీరాన్ని చూస్తున్నాడు ..
టెన్షన్ లో మనిషి మెదడు చాలా చురుకు గా పనిచేస్తుంది
అనడానికి ఇదే ఉదాహరణ అన్నట్టు ..
ఆ చీకటిలో కూడా ..అతనికి ఆ ప్రాణం లేని మనిషి
రూపం బాగానే కనిపిస్తోంది ..
మొహం మీద గెడ్డం ..
పగిలిన కళ్ళజోడు..
ఇక నుండి ఆ కళ్ళ జోడు అవసరం లేని ఆ మనిషి కంటి కింద ఏదో మచ్చ లా ఉంది ..
కానీ మెరుస్తోంది చంద్రుడి వెలుగు కి ..
ఆ మచ్చని ముట్టుకున్నాడు..భయమేసింది ..
మొబైల్ ఇంకా కాస్త దగ్గరికి పెట్టాడు ..
తను అనుకున్నది తప్పు..
అది మచ్చ కాదు ..
రక్తం..
దేనికైనా లిమిట్ అనేది ఉంటుంది అని అనుకుంటాడు కిట్టు ..
కానీ ఇవాళ తన టెన్షన్ విషయంలో అది తప్పనిపించింది..
ఎందుకంటే అతని టెన్షన్ గత పది నిమిషాల నుండి పెరుగుతూనే ఉంది ..
తన గుండె ఎంత స్పీడ్ గా కొట్టుకున్టూందో తను ఫీల్ అవ్వగాలుగుతున్నాడు..
కానీ ఏం చేయాలో తెలియట్లేదు ..
ఈ మనిషి ఎవరో ..ఏంటో ..తెలుసుకునే ప్రయత్నం లో..
ప్యాంటు జేబులు వెతుకుతున్నప్పుడు..
మొబైల్ దొరికితే ..
క్లిక్ చేసి ..అన్లోక్ చేశాడు..
అదేంటో కానీ తనకి అన్ని అలానే జరుగుతున్నాయి కొద్దిసేపటి నుండి ..
అక్కడ ఉన్న వాల్ పేపర్ లో వాక్యాలు చూస్తే అతనికి మళ్ళీ టెన్షన్ మొదలైంది ..
ఏదో మిస్టరీ నోవెల్ లో ఉన్నట్టు గా ఉంది అక్కడ పరిస్థితి ..
ఆ వాల్ పేపర్ ఒక కొటేషన్ ..
"డెత్ ఇస్ ది అగ్లీ ఫాక్ట్ విచ్ నేచర్ హేస్ టు హైడ్ అండ్ షి హైడ్స్ ఇట్ వెల్ ".......
బాక్గ్రౌండ్ లో స్కల్ మీద 2 బోన్స్ క్రాస్ గా ఉన్న డేంజర్ సింబల్..
సరే ఆ మనిషికి సంబంధించిన వాళ్ళెవరికైనా కాల్ చేసి చెప్పచ్చు అని ..
అతని మొబైల్ ఫోన్ లో కాంటాక్ట్స్ క్లిక్ చేసి పేర్లు చూస్తే ..
ఈ సరి తనకి కలిగిన ఫీలింగ్ ..ఆశ్చర్యం !!
ఆ పేర్లు నమ్మలేకుండా ఉన్నాయి ..
1st నేమ్ అల్లు అర్జున్ ..!!
అలా ఇంకా స్క్రోల్ అవ్తుంటే చాలా పేర్లు సెలెబ్రిటీస్ వే కనబడుతున్నాయ్ . .
తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం అక్కడే ఉన్నట్టు అనిపించింది ..
మద్య మద్యలో కొందరి రాజకీయ నాయకుల పేర్లు కూడా ..
ఇంత మంది సెలెబ్రిటీస్ పేర్లు కాంటాక్ట్ లిస్టు లో ఉన్న ఆ మనిషెవరో మాత్రం తనకి ఐడియా రావట్లేదు ..
అప్పటి వరకు చీకటి గా ఉన్న ఆ రోడ్డు మీదకి నెమ్మదిగా ఒక వెలుగు చేరుకుంది..
ఆ వెలుతురు బజాజ్ పల్సర్ హెడ్ లైట్ ది..
ఆ పల్సర్ తన ఫ్రెండ్ అశోక్ ది ..
కిట్టు అంతక ముందు కాల్ చేసింది అశోక్ కే ..!
ఆల్రెడీ శవం గురించి కిట్టు చెప్పడం తో ..
10 నిమిషాల క్రితమే అశోక్ కి టెన్షన్ పట్టుకుంది ..
అలా కంగారుగా వచ్చిన అశోక్ ,కిట్టు పక్కన కుర్చునాడు ..
ఇద్దరికీ ఒక క్షణం మాటలు రాలేదు ..
మొబైల్ గురించి తెలుసుకున్న అశోక్ కూడా షాక్ అయ్యాడు ..
ఆ శవాన్ని దగ్గర నుండి చూసిన అశోక్ ఒక్కసారి గా ఉలిక్కిపడి ..
"ఇతని పేరు నెహ్రు రా..ఇతనొక సినిమా ప్రొడ్యూసర్..నాకు చాలా ఇష్టం రా..చాలా పలుకుబడి ఉన్న మనిషి..మేయర్ గా కూడా పోటి చేస్తాడు అని అనుకుంటున్నారు " అన్నాడు అశోక్ ..
"అవునా"అన్నాడు కిట్టు ..
"అవును....కానీ ఇదంతా ఏంటో నాకు అర్ధం కావట్లేదు.."
"అదేరా భయంగా ఉంది ..
దానికి తోడు ఆ సెల్ లో వాల్ పేపర్ ఏంట్రా బాబు ..ఇంకేమి దొరకనట్టు "
"సరే లే కానీ ..వెంటనే పోలీసులకి ఫోన్ చేద్దాం.."
"ఆ చెయ్యి ..నాకసల ఈ శవాన్ని చూస్తే ఏం చేయాలో తెలియ లేదు..ఈ పాటికే చేసి ఉండాల్సింది"
వెంటనే పోలీసు స్టేషన్ కి కాల్ చేసి అశోక్ జరిగిన విషయం చెప్తే ..
పోలీసులు ఆ స్పాట్ కి వస్తారు ..
శవం ఉన్న చోటుని హై వోల్టేజ్ లైట్స్ లో పరీక్ష చేసి ..
ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి ..
శవాన్ని ప్రభుత్వ ఆసుపత్రి కి తరలిస్తారు ..
ఎఫ్.ఐ.ఆర్ ఫైల్ చేస్తారు ..
స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్ లో కాంటాక్ట్స్ చూసి ఆశ్చర్య పోయి..
ఆ నెంబర్స్ కి కాల్ చేయడం స్టార్ట్ చేస్తారు ..
అలా చేస్తుంటే చాలా వరకు ఆ నెంబర్స్ స్విచ్డ్ ఆఫ్ అని కానీ ..
నాట్ ఇన్ యూస్ అని కానీ వస్తు ఉంటాయ్ ..
4 నెంబర్స్ తప్ప..
అవి ........
ప్రియ (సినిమా హీరోయిన్)..
దాస్ (ప్రొడ్యూసర్ )..
నర్సి (ఎవరో తెలిదు)..
బుచ్చయ్య చౌదరి (ఎం.ఎల్.ఎ ..కాకినాడ)..
అందరూ నిద్ర నుండి లేచి నెహ్రు చనిపోయాడు అని తెలియగానే షాక్ అవుతారు..
కానీ ఇద్దరు వ్యక్తులు మనసులో చాలా బాధ పడతారు..ఇంకొక ఇద్దరు సంతోష పడతారు..

తరువాత రోజు న్యూస్ పేపర్ లో ఇదొక ముఖ్యమైన న్యూస్ ..
శవం అయిన నిర్మాత ..
సెల్ స్వాధీనం ..
అని ముఖ్యాంశాలు ..
కానీ ఆ న్యూస్ పేపర్ వాళ్ళకి తెలియని విషయం ఏమిటి అంటే ..
నెహ్రు సెల్ లో మెమరీ కార్డు ఉందని ..
ఆ కార్డు అశోక్ ఎవరికీ తెలియకుండా తీసుకుని వెళ్ళాడు అని ..
అదే టైం లో అశోక్ తన ఇంటి దగ్గర కంప్యుటర్ ఆన్ చేసి ..
మెమరీ కార్డు ఇన్సర్ట్ చేసి దానిలో ఉన్న ఒక వీడియో ఫైల్ ఓపెన్ చేసి చూస్తూ గట్టిగా అరిచాడని!!..

వెంటనే చాలా వెలుతురు ..
కళ్ళు తెరవడానికి చాలా కష్టం గా ఉంది ..
ఎక్కడున్నాడో తెలియట్లేదు అశోక్ కి

ఈ లోపు చాలా పరిచయం ఉన్న గొంతు ఒకటి వినపడుతోంది .అశోక్ కి ...
అది కూడా చాలా దగ్గర నుండి

"ఒరేయ్ అశోక్ ఏమైంది నీకు ..ఎందుకలా అరుస్తున్నావ్ ?.."
ఆ వాయిస్ ఎవరిదో తెలిసింది అశోక్ కి ..
"ఇదేంటి అమ్మ!! నువ్వు వీడియో లోకి ఎలా వచ్చావ్? .."
"వీడియో ఏంట్రా ??..ఏం మాట్లాడ్తున్నావ్ .."
"కాదమ్మా ....నెహ్రు ని చంపేసారు..నేను ఆ శవాన్ని చూశా.."
"నేమొహం లే కానీ ..కల గని ఉంటావ్ ..అందుకే త్వరగా పడుకోమని చెప్పేది ..
లేచి రెడీ ఆవు ..కాలేజీ కి వెళ్ళాలి "
అశోక్ కి చాలా సేపటివరకు జరిగినది కలో!..
లేక జరుగుతున్నది కలో అర్ధం కాదు..
కొంతసేపటికి అశోక్ ఇదంతా కల అని అతను నమ్ముతుండగా..
"ములాఖాతెయిన్!! ఏ నిమిషం ఎటు వెళుతుందో!!" అనే పాట అశోక్ కి వినబడుతుంది.ఆ పాట ఏ ఫిలిం బై అరవింద్ అనే ఒక థ్రిల్లర్ సినిమా లోని బ్యాక్ గ్రౌండ్ మ్యూసిక్ .ఈ టైం లో ఆ పాట వినపడడానికి కారణం,అది అశోక్ సెల్ ఫోన్ కి రింగ్ టోన్ అవ్వడం .
ఆ కాల్ చేసింది అశోక్ ఫ్రెండ్ కిట్టు!!!!..
"హలో"అని అశోక్ అనగానే..
హలో అని కూడా అనకుండా కిట్టు చెప్పిన న్యూస్ విని అశోక్ షాక్ తింటాడు..
వెంటనే టి.వి. ఆన్ చేసి న్యూస్ చూస్తే....
కాకినాడ-ఉప్పాడ రోడ్డు మీద శవం గా కనబడ్డ ప్రముఖ నిర్మాత నెహ్రు..
హత్య అని తేల్చి చెప్పిన పోలీసులు..
అని ముఖ్యాంశాలు..
అదే సమయం లో వంట గది నుండి టి.వి చూసిన అశోక్ వాళ్ళ అమ్మ గారు కూడా షాక్ అవుతారు..
ఇది కల అని అనుకోవడానికి ఈ సారి వాళ్ళల్లో ఏ ఒక్కరూ కూడా నిద్ర లో లేరు......
అసలే సస్పెన్స్ థ్రిల్లర్స్ ని చాలా ఇష్టపడే అశోక్ కి ఈ రామ్ గోపాల్ వర్మ తరహా ముగింపు తన జీవితం లో ఎదురవడం నమ్మలేకుండా ఉంది..
అదే సమయం లో..
"ములాఖాతెయిన్!! ఏ నిమిషం ఎటు వెళుతుందో!!"..
అంటూ మల్లీ అతని సెల్ రింగ్ అవ్వడం మొదలుపెట్టింది..

నిజమే!!
ఏ నిమిషం ఎటు వెళుతుందో!

BHARGAW.ADDALA

No comments: